రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుట్లూరు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని టిప్పర్‌ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి, అతని ఎనిమిదేళ్ల కుమారుడు మృతి చెందారు.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుట్లూరు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని టిప్పర్‌ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్, టిప్పర్ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.బైక్ పూర్తిగా దగ్ధం కాగా, టిప్పర్ పాక్షికంగా దెబ్బతింది.

మృతులు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన కుమార్ (40), అతని కుమారుడు ప్రదీప్ (8)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ప్రదీప్ సజీవదహనమయ్యాడు.

ప్రమాదం తర్వాత టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *