అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సులేమానానగర్‌లోని ఎంఎం పహాడీ నివాస ప్రాంతంలో ఉన్న స్కార్ప్ యార్డ్ కమ్ కట్టెల విక్రయ కేంద్రంలో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: రాజేంద్రనగర్ సులేమానానగర్‌లోని స్క్రాప్ యార్డులో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సులేమానానగర్‌లోని ఎంఎం పహాడీ నివాస ప్రాంతంలో ఉన్న స్కార్ప్ యార్డ్ కమ్ కట్టెల విక్రయ కేంద్రంలో మంటలు చెలరేగాయి.
స్థానికుల సమాచారం మేరకు రెండు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని ఇళ్లలో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.