స్పెయిన్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. భారీ వర్షాలతో అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదలు సృష్టించిన విలయానికి ఇప్పటివరకు మృతుల సంఖ్య 158కి చేరుకొంది.
కార్లు, శిథిల భవనాల్లోని మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పెయిన్ అత్యవసర ప్రతిస్పందన విభాగానికి చెందిన 1,000 మంది సైనికులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టారు. భవనాలు, కార్లపై చిక్కుకున్న పౌరులను హెలికాప్టర్‌లతో ఎయిర్ లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్పెయిన్ రవాణశాఖ మంత్రి అస్కార్ పుయెంటే తెలిపారు. ఇప్పటివరకూ హెలికాప్టర్‌ల సాయంతో 70 మందిని రక్షించినట్లు వెల్లడించారు.