అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ , డెమోక్రటిక్ పార్టీల మధ్య ప్రధాన పోటీ జరగ్గా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు విజయభేరి మోగించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేందుకు కావాల్సిన 270 ఎలక్టోరల్ సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ట్రంప్ చేరుకున్నారు. దీంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. జీవితంలో ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన మద్దతుదారులతో సమావేశమైన ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ప్రజలు సాధించిన విజయమిదని ప్రసంగించారు.
తన విజయానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అమెరికా ప్రజలు కష్టాలు తీరబోతున్నాయని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఇంతటి విజయాన్ని అమెరికన్ ప్రజలు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. దేశంలో కొత్త చట్టాలను తీసుకురావడానికి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తామని ట్రంప్ వెల్లడించారు.