News5am, Latest Indonesia Bomb Blast News (13-05-2025): ఇండోనేషియాలో ఒక భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. సైనిక బృందం కాలం చెల్లిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా అకస్మాత్తుగా ఈ ఘోరం జరిగింది. ఈ పేలుడుతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని గరుట్ రీజెన్సులో ఉన్న సాగర గ్రామంలో ఈ ఘటన జరిగింది. జకార్తా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో నలుగురు సైనికులు, తొమ్మిది మంది నివాసితులు చనిపోయినట్లు ఇండోనేషియా ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ వాహ్యు యుధాయన తెలిపారు. బాధితులను పమెంగ్‌ప్యూక్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ముందుగా రెండు ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేసిన బృందం మూడో స్థలంలో పనిచేస్తుండగా, అనుకోని ప్రమాదం జరిగింది. అంతకుముందు ఆ ప్రాంతాన్ని బృందం పలుమార్లు పరిశీలించి సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
More latest telugu news:
Latest Telugu News:
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరొకరు అరెస్టు..