Latest Breaking News

News5am, Latest Breaking News (10-06-2025): ఎలన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ భారత్‌లో త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది. నెలకు రూ.3 వేలకు అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌ను అందించనుందని అంచనా. సర్వీసు ప్రారంభం అయ్యే మొదటిరోజుల్లో రూ.800–1,000కే ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ సర్వీసు కోసం ఒకసారి రిసీవర్ కిట్‌ ఖర్చు రూ.33,000 ఉంటుంది. మొత్తం ఖర్చు మొదటి ఏడాది దాదాపు రూ.66,000 ఉండొచ్చని అంచనా. స్టార్‌లింక్ ఇప్పటికే భారత టెలికాం మంత్రిత్వశాఖ నుంచి కీలక లైసెన్స్‌ను పొందింది. భారత్‌లో వన్‌వెబ్, జియో శాటిలైట్ బిజినెస్‌లతో పాటు ఇది కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఇవ్వనుంది. 25 Mbps నుంచి 220 Mbps వరకు స్పీడ్ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ, అందుబాటులో లేని ప్రాంతాలను టార్గెట్ చేస్తోంది.

ఈ సేవల కోసం ట్రాయ్ చేసిన స్పెక్ట్రం సిఫార్సులు ఇంకా ప్రభుత్వ ఆమోదం పొందలేదు. అలాగే ఇన్‌స్పేస్ నుంచి ఫైనల్ అప్రూవల్ కూడా రావాల్సి ఉంది. మార్కెట్‌పై ఆధారపడి రెసిడెన్షియల్ లైట్ ప్లాన్‌లు రూ.2,600–3,000 మధ్య ఉండగా, స్టాండర్డ్ ప్లాన్‌లు రూ.4,000–6,000 వరకు ఉండొచ్చని సమాచారం. భారతదేశంలో మొబైల్ లేదా ఫైబర్ నెట్‌వర్క్‌ సేవలు అందని ప్రాంతాల్లో ఈ సర్వీసులు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే బంగ్లాదేశ్ తరహా ధరలకే సేవలు ఇవ్వనున్నట్లు సూచనలు ఉన్నాయి.

More Breaking News:

Latest Breaking News:

ఎలాన్ మస్క్ కొత్తపార్టీ ‘‘ది అమెరికన్ పార్టీ’’..

ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడి..

More Today News: External Sources

స్టార్‌‌‌‌‌‌‌‌లింక్‌‌‌‌ అన్లిమిటెడ్ ఇంటర్నెట్.. నెలకు రూ.మూడు వేలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *