అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్ తీవ్రత పసిఫిక్ వాయవ్య ప్రాంతానికి చేరింది. ఉపగ్రహం చిత్రాలు తుపాను భయంకర సుడులు చూపించాయి. తుపాను కారణంగా వాషింగ్టన్‌లో చెట్లు పడిపోవడంతో ఇద్దరు మరణించారు. భారీ వర్షాల, మంచు విపరీతంగా పడుతుండడంతో 6 లక్షల ఇళ్లకు విద్యుత్తు నిలిచిపోయింది. వాషింగ్టన్, ఓరెగావ్, కాలిఫోర్నియాలో స్కూళ్లు మూతపడ్డాయి, వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
తుపాను కారణంగా పశ్చిమ, వాయవ్య అమెరికా దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోంది. బాంబ్ సైక్లోన్ ప్రభావం కెనడా, బ్రిటిష్ కొలంబియాపైనా పడింది. కెనడా పసిఫిక్ తీరంలో 2.25 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.