బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ కేసులో సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో విజయ్ మద్దూరి మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. రాజ్ పాకాల ఫాంహౌస్ కేసులో పోలీసులు విజయ్ ని ఏ2 నిందితుడిగా చేర్చారు. దీంతో వివిధ అంశాలపై అతనిని విచారించారు. పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సరఫరా చేశారు? అనే కోణంలో విచారణ సాగింది.
ఇంతకుముందు, రాజ్ పాకాల కూడా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట తన న్యాయవాదితో కలిసి రాజ్ పాకాల విచారణకు హాజరయ్యాడు. మద్యం కొనుగోలు, దానిని ఫాంహౌస్‌కు తీసుకు రావడం, మద్యం ఎక్కడి నుంచి సరఫరా అయింది. ఇలా పలు అంశాలపై రాజ్ పాకాల నుంచి సమాధానాలు రాబట్టారు.