విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో తెలుగు విద్యార్థి చనిపోవడం కలకలం రేపుతోంది. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ అక్కడ మెడిసిన్ చదువుతున్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అర్ధరాత్రి సమయంలో ఫ్రెండ్స్ శుభాకాంక్షలు చెప్పేందుకు ఆమె వద్దకు వెళ్లారు.
వారు వెళ్లేసరికి గదిలో శవమై తేలింది ,ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు . మృతురాలు స్నిగ్ధ తండ్రి అమృత్ రావు విద్యుత్ శాఖలో డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థిని మృతి వార్తతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు స్నిగ్ధ మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ఆ దేశ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.