జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కాటారం మండలంలోని దేవరాంపల్లి గ్రామానికి చెందిన సారయ్య (55)ను అదే గ్రామానికి చెందిన దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, కళ్ళలో కారంపొడి చల్లి, గొడ్డలితో నరికి ఈ దారుణం జరిపినట్లు సమాచారం.

స్థానికులు ఈ సంఘటనను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కాటారం ఎస్సై మ్యాక్ అభినవ్ సంఘటనను పరిశీలించారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహదేవ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *