ఈ మధ్యకాలంలో రాజధానిలో డ్రగ్స్ పట్టివేతలు చాలా చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. తాజాగా హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ కి డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 కేజీల ఎఫిడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 60 లక్షలు ఉంటుందని చెప్పారు. హైదరాబాద్లో డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి విదేశాలకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న ముఠాలను ఎఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.