రాజమండ్రి ఎయిర్ పోర్టులో తనిఖీల సందర్భంగా ఓ ప్రయాణికుడి నుంచి బులెట్లు లభ్యం కావడం కలకలం రేపింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతడి వద్ద ఆరు బులెట్లు బయటపడ్డాయి. వెంటనే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని, అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతడికి అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఎవరి కోసం తీసుకెళుతున్నారు? వీటికి లైసెన్స్ ఉందా? వంటి విషయాలను ఆరా తీస్తున్నారు. అయితే బుల్లెట్లు తనవేనని ప్రయాణికుడు భద్రతాసిబ్బందితో తెలిపినట్లు తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.