మందు, గంజాయి విక్రయదారులతో పాటు, హైదరాబాద్‌లో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలకు తెర లేపారు. గోవా నుంచి విమానాల్లో మద్యం బాటిళ్లను తీసుకువస్తుండగా శంషాబాద్ విమానాశ్రయం వెలుపల ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. వీటిలో కొన్ని తాగేందుకు తీసుకొచ్చినవి, మరికొన్ని వ్యాపారంలో పట్టుబడ్డాయి. ఎక్సైజ్ పోలీసులు సరైన సమాచారంతో విమానాశ్రయం వెలుపల తనిఖీలు నిర్వహించి 30 బాటిళ్లతో ఏడుగురిని పట్టుకున్నారు.

మరో 90 మంది ఒకటి, రెండు బాటిల్స్​తో రాగా వాటిని స్వాధీనం చేసుకుని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. రూ.12 లక్షల విలువైన 415 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద మెట్రో స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఒక కారు నుంచి మరో కారుకు రూ. 3.85 లక్షల విలువైన 72 మద్యం బాటిళ్లు మారుస్తుండగా పట్టుకున్నారు. విచారణలో అత్తాపూర్‌కు చెందిన గోపాల్‌ అగర్వాల్‌ చండీగఢ్‌ నుంచి కారులో మద్యం తీసుకొచ్చినట్లు తెలిపాడు. హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి సీఐని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *