ఈ ఘటన మెదక్ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మాయమాటలు చెబుతున్నారని అనుమానించిన గ్రామస్తులు కర్రలు, రాళ్లతో ముగ్గురిపై కిరాతకంగా దాడి చేశారు. ఆ గ్రామం మొత్తం మీద ఒక్కరు కూడా వారిని కాపాడడానికి ముందుకు రాలేదు. బాధితుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ అయిన గొల్లగూడెం గ్రామంలో మంగళవారం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే కొల్చారం మండలం ఏటిగడ్డ మాందాపూర్‌కు చెందిన రాములు(56), నిజాంపేట మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బాలమణి తమ సమీప బంధువు కోట భట్టి గంగవ్వ ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గంగవ్వ ఇంటి దగ్గర నిమ్మకాయలు ఉన్నాయని స్థానికులు నిలదీశారు. అంతే కాకుండా మంత్రాలపై స్థానికులకు అనుమానం వచ్చింది. సోమవారం అమావాస్య కావడంతో ఇంటి దగ్గర నిమ్మకాయలు ఉండడంతో స్థానికులు గంగవ్వ ఇంటి నుంచి ముగ్గురిని బయటకు లాగి దారుణంగా కొట్టారు. వ్యక్తి మృతికి కారణమైన వారి వివరాలను సేకరించి వారిపై కేసులు నమోదు చేయాలనీ సీఐ రేణుకను ఆదేశించారు. గ్రామంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.