హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమను అంగీకరించలేదని, పెళ్లి చేసుకోలేదని కక్షతో స్నేహితురాలిని విచక్షణారహితంగా రాయితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో ముఖంపై పొడిచి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. మియాపూర్ ఇన్ స్పెక్టర్ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, దీప్తిశ్రీనగర్ కు చెందిన స్పందన(29), గచ్చిబౌలి సుదర్శన్ నగర్ ఏఎల్ ఎంఓయూ కాలనీకి చెందిన వినయ్ కుమార్ , ఎం.మనోజ్ కుమార్ (29) ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులు. ఆ సమయంలో మనోజ్ ప్రపోజ్ చేయగా ఆమె నిరాకరించింది. మనం స్నేహితులుగా ఉండాలి అని చెప్పింది. ఆ తర్వాత వినయ్‌కుమార్‌తో ప్రేమలో పడింది.
2022లో పెద్దల అంగీకారంతో పెండ్లి చేసుకుంది. కొన్ని నెలలకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులకు అప్లయ్చేశారు. అప్పటి నుంచి స్పందన తన తల్లి, సోదరుడితో కలిసి దీప్తి నగర్ లోని సీబీఆర్ఎస్టేట్ లో ఉంటోంది. వినయ్కుమార్అదే కాలనీలోని మరో ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మనోజ్‌కుమార్ స్పందనకు దగ్గరయ్యాడు. తరచూ స్పందన ఇంటికి వెళ్లి తన ప్రేమను యాక్సెప్ట్చేయాలని, పెండ్లి చేసుకుంటానని వేధించేవాడు. స్పందన తిరస్కరించడంతో, గత నెల 30న ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న స్పందన పై దాడి చేశాడు. ఆమె తలపై గ్రానైట్ రాయితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో ముఖంపై పొడిచాడు. ఆ తర్వాత మెయిన్ డోర్‌కు బయట నుంచి తాళం వేసి పారిపోయాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మనోజ్ కుమార్ స్పందనను హత్య చేసినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.