ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై 2024 ఆగస్టు 9వ తేదీన పోలీసు వాలంటీర్ గా పని చేస్తున్న సంజయ్ రాయ్ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటనపై జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం చెలరేగింది. నవంబర్ 12న విచారణ ప్రారంభమైన తర్వాత సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్, సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చుతూ తీర్పును వెల్లడించారు. అయితే, తీర్పు సమయంలో, సంజయ్ రాయ్ మాట్లాడుతూ, తనను ఈ కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఇక, శిక్ష ఖరారుకు ముందు ఈరోజు మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని సంజయ్ రాయ్ కి న్యాయమూర్తి చెప్పాడు.

అయితే, నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్‌ రాయ్ తో పాటు మరి కొంత మంది ఉన్నట్లు బాధిత జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు సైతం తెలియజేస్తున్నారు. పోలీసులు, సీబీఐ ఈ కేసును ఒకరి మీద నెట్టి వేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్ తో ఉన్న మరికొందరికి కోసం పోలీసులు, సీబీఐ క్షుణ్ణంగా విచారణ చేసి, తగిన శిక్ష విధించాలని చూస్తున్నారు. కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసులో నిందితుడికి కోల్‌కత్తాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 20) ఎలాంటి శిక్ష విధించబోతుందనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *