జర్నలిస్టులుగా డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులమని చెప్పుకుంటూ కొందరు ముఠాగా ఏర్పడి డబ్బుల కోసం బెదిరిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీకి చెందిన ఏలూరి రాజేష్ ను విచారించారు. కొత్తగూడెం పట్టణంలోని బర్లిఫెట్కు చెందిన దాసరి సాంబశివరావు, చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన గుంటూరు శ్రీనివాసరావు, రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన మేకల రమేష్, కొత్తగూడెం పట్టణంలోని మేదరబస్తీకి చెందిన బాదావత్ గణేష్ చోరీకి పాల్పడ్డారు. వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.