రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో మహిళా కానిస్టేబుల్ నాగమణిని ఆమె తమ్ముడు దారుణంగా చంపాడు. పరమేష్ తమను చంపేస్తారని, తెలుసు అని మృతురాలి భర్త శ్రీకాంత్ ఎన్టీవీకి తెలిపారు. పెళ్లయ్యాక పోలీస్ స్టేషన్ బయట మమ్మల్ని బెదిరించారని ఆరోపించారు. అయితే తన సొంత అక్క నాగమణిని చంపేస్తానని ఊహించలేదని చెప్పాడు. నిన్న ఆదివారం సెలవు కాబట్టి ఊరికి వచ్చాం, అయితే, నాగమణి కంటే 10 నిమిషాల ముందే నేను బయల్దేరాను, ఆమె నాతో ఫోన్‌లో మాట్లాడుతుండగా పరమేశం ఆమెను కారుతో ఢీకొట్టాడు.

ఇక, వెంటనే మా అన్నయ్యను వెళ్ళమని చెప్పాను అప్పటికే రక్తపు మడుగులో నాగమణి పడి ఉంది. ఘటనా స్థలానికి వెళ్ళేలోపే చనిపోయింది అని ఆమె భర్త శ్రీకాంత్ తెలిపాడు. అయితే, కానిస్టేబుల్ నాగమణిని చంపిన పరమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం మూడు టీమ్ లు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా అతన్ని పట్టుకేనేందుకు గాలిస్తున్నాం అని తెలిపారు. నాగమణి భర్త ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ హత్యలో పరమేశ్ ఒక్కడే ఉన్నాడా లేక అతనికి ఇంకెవరైనా సహకరించారా అనేది తెలుస్తుంది అని పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *