ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి రావడంతో క్యాష్ పేమెంట్స్ పూర్తిగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు ఆన్‌లైన్ ద్వారా పేమెంట్స్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ క్యూ ఆర్ కోడ్స్, వెబ్ లింకులతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుని సైలెంట్‌గా పరారు అవుతున్నారు.
మరికొందరు కేటుగాళ్లు లోన్లు ఇస్తామని, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి జనాలను నిండా ముంచేస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆన్‌లైన్ టాస్క్‌ల పేరుతో సైబర్ చీటర్స్ అమాయకులకు వల వేస్తున్నారని పేర్కొన్నారు. స్క్రాచ్ కార్డుల, ఆన్‌లైన్ టాస్క్‌లంటూ హడావుడి చేస్తున్నారని ఫోన్లకు వెబ్ లింకులు పంపిస్తున్నారని తెలిపారు. అన్‌నోన్ నెంబర్ల నుంచి కాల్స్, మేసేజ్‌లు వచ్చినా ఎవరూ రెస్పాండ్ అవ్వొద్దని వెబ్ లింకుల జోలికి వెళ్లకూడదంటూ సైబర్ క్రైం పోలీసులు సామన్య ప్రజలకు సూచనలు చేశారు.