హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రెడ్ హిల్స్ లోని నీలోఫర్ కేఫ్ వద్ద ఓ కారు వేగంగా వచ్చి జనాల పైకి దూసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు అతడిని పట్టుకొని చితకబాది, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో పలువురు వ్యక్తులకి గాయాలు అయ్యాయి.


ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వాహనంపై నియంత్రణ కోల్పోయిన తర్వాత, అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఘటనపై పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *