మరో సారి హైదరాబాద్‌లో ఈ భారీ డ్రగ్స్ దందా జరిగింది. యువతులపై అత్యాచారం చేసేందుకు డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు. స్నేహం పేరుతో యువకులు తోటి అమ్మాయిలను తీసుకెళ్లి కూల్ డ్రింక్స్ లో మత్తుమందు కలుపుతున్నారు. యువకులు ఆంఫేటమైన్ మత్తుమందులతో యువతులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో బోయిన్ పల్లి ప్రాంతంలో 8.5 కిలోల ఆంఫేటమైన్ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కూల్ డ్రింక్ లో ఈ మందు కలిపి అమ్మాయిలను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో సంగారెడ్డికి చెందిన కుంచల్ నాగరాజుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగరాజుకు సహకరించిన వినోద్ కుమార్, కుంతి శ్రీశైలంలను అరెస్టు చేశారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.