ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సురేశ్ (53), హేమలత (45), వారి కుమారుడు హరీశ్ (22) ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆటలు ఆడటం ప్రారంభించాడు. ఇందుకోసం అప్పులు చేసి మరి ఈ గేమ్స్ ఆడాడు. దీంతో ఆ అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులు చివరికి పోలాన్ని అమ్మాల్సి వచ్చింది. పొలం అమ్మినా కూడా అప్పుడు తీరలేదు. దీంతో ఆ కుటుంబంలో ముగ్గురు చివరికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.