భాగ్యనగరంలో డ్రగ్స్ మరోసారి గందరగోళం సృష్టించింది. హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో రెండు డ్రగ్స్ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ న్యూ పోలీసు ఆపరేషన్‌లో డ్రగ్స్‌ వ్యాపారులు పట్టుబడ్డారు. ఒక విదేశీయుడు సహా ముగ్గురు డ్రగ్స్ డీలర్లను అరెస్టు చేశారు. హుమాయిన్ నగర్‌లో 50 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం. కంచన్ బ్యాగ్ నుంచి 80 గ్రాముల ఎండీఎంఏ, 10 గ్రాముల ఎల్‌ఎస్‌డీ స్వాధీనం చేసుకున్నారు. రూ.20.75 లక్షల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ అరెస్ట్ విషయమై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

ఇందులో 756 కిలోల గంజాయి, 1235 కిలోల గంజాయి నుంచి హాష్​ఆయిల్​తీయగా మిగిలిన పిప్పి, 1.315 కిలోల వెట్‌‌ గంజాయి, గంజాయి మొక్కలు, 8 గ్రాముల ఎండీఎంఏ, 10 కిలోల హాష్ ఆయిల్, మరో 10 కిలోల గంజాయి చాక్లెట్లు ఉన్నాయని వివరించారు. గంజాయి విలువ రూ.1.89 కోట్లు, పాపిష్ట విలువ రూ. 62 లక్షలు, 180 గ్రాముల కొకైన్​విలువ రూ.37 లక్షలు, హాష్​ఆయిల్​ రూ.10 లక్షలు, ఎండీఎంఏ, ఎల్​ఎస్​డీ బ్లాస్ట్స్​విలువ రూ.2 లక్షలు కలిపి మొత్తంగా రూ. 3 కోట్ల విలువ చేస్తాయని ఎక్సైజ్‌‌ పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *