ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
హైదరాబాద్: నిద్రలో ఉన్న తల్లిని బండరాయితో కొట్టి ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని ఇంట్లో నిద్రిస్తున్న తల్లి హేమా(70)పై రాజిరెడ్డి బండరాయితో దాడి చేశాడు.
జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన మరో మహిళపై కూడా అతడు దాడి చేశాడు. గాయపడిన ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
హత్యానంతరం నిందితుడు తప్పించుకోగా పక్క గ్రామంలోని వ్యక్తులు దొంగగా అనుమానించి పట్టుకున్నారు. వారు అతడిని కొట్టి, కాళ్లు, చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని, సైకోలా ప్రవర్తిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు.