హైదరాబాద్: మాదాపూర్‌లో ఆదివారం బైక్‌పై వచ్చిన దుండగులు ఓ మహిళ నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. రోడ్డుపై పార్వతి అనే మహిళ నిలబడి ఉండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లి పారిపోయారు. ఈ ఘటనలో మహిళ రోడ్డుపై పడి స్వల్ప గాయాలయ్యాయి.

మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను గుర్తించి పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. మహిళను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *