మాజీ మోడల్‌ దివ్వ పాహుజా మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 2న హర్యానా గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో మోడల్‌ దివ్వ పాహుజా హత్యకు గురైంది. అయితే, దివ్వ పాహుజాను నిందితులు పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్ లో కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, పాహుజా మృతదేహాన్ని ఇటీవల హరియాణాలోని కాలువలో స్వాధీనం చేసుకున్నారు. మాజీ మోడల్‌ దివ్వ పాహుజా మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 2న హర్యానా గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో మోడల్‌ దివ్వ పాహుజా హత్యకు గురైంది. అయితే, దివ్వ పాహుజాను నిందితులు పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్ లో కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, పాహుజా మృతదేహాన్ని ఇటీవల హరియాణాలోని కాలువలో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హిస్సార్‌లోని మెడికల్‌ కళాశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. అయితే, తొలుత ఆమె తల భాగానికి ఎక్స్‌రే తీయగా.. తూటా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితులు ఆమె కంటి వద్ద కాల్చినట్లు తేల్చారు. బుల్లెట్‌ పిల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతర శరీర భాగాలపై కూడా గాయాల ఆనవాళ్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మృతదేహం నుంచి సేకరించిన భాగాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించి.. దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం దివ్య కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు.

అయితే, హర్యానాలోని ఫతేహాబాద్‌లోని తోహ్నాలోని భాక్రా కెనాల్‌లో పాహుజా మృతదేహం లభ్యమైంది. హత్య జరిగిన 11 రోజుల పాటు నీళ్లలో ఉండడంతో శరీరం పూర్తిగా ఛిద్రమైంది. ఆమె తల వెంట్రుకలు కూడా పూర్తిగా ఊడిపోయాయి. ముందుగా గుర్తుతెలియని శవంగా అనుమానించిన పోలీసులు.. దివ్య కుటుంబసభ్యులను పిలిపించారు. మృతదేహం వెనుక, చేతులపై ఉన్న టాటూలను పరిశీలించి అది దివ్య పహుజా మృతదేహమని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఫతేబాద్‌ నుంచి హిసార్‌లోని ఆగ్రోహా మెడికల్‌కు తరలించి వివరాలు సేకరించారు. ఈ కేసులో మరో నిందితుడు రవి బంగా ఇంకా పరారీలో ఉన్నాడు. అతని కోసం అన్వేషణ సాగుతోందని పోలీసులు తెలిపారు.

కాగా.. గ్యాంగ్‌స్టర్‌ సందీప్‌ గడోలీ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో నిందితురాలైన మాజీ మోడల్‌ దివ్య పాహుజాను జనవరి 2న గురుగ్రామ్‌లోని హోటల్‌లో ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవ్వడంతో.. పోలీసులు హోటల్‌ యజమాని అభిజీత్‌ సింగ్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే, ఆమెకు హర్యాణా గ్యాంగ్‌స్టర్‌ సందీప్‌ గడోలీతో దివ్యకు సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. 2016లో ముంబయిలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో సందీప్‌ మరణించాడు. అయితే, అది నకిలీ ఎన్‌కౌంటర్‌ అని, సందీప్‌నకు ప్రత్యర్థి అయిన బిందర్‌ గుజ్జర్‌ అనే గ్యాంగ్‌స్టర్‌.. పోలీసులతో కుమ్మక్కై చేయించాడని తేలింది. బిందర్‌ కుట్రలో భాగంగానే సందీప్‌ను దివ్య అక్కడికి తీసుకొచ్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమె ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించింది. ఈ క్రమంలో ఆమెను హత్యచేయడం కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *