సినిమాల ప్రభావం అందరిపై ఉంటుంది. కానీ స్మగ్గర్లపై మాత్రం.. దాని ప్రభావం కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. పుష్ప సినిమాలో స్మగ్లర్ అయిన అల్లు అర్జున్ కొత్త కొత్త ఐడియాలతో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే.. ఇక్కడ మాత్రం రియల్ స్మగ్లర్లు గంజాయి పోలీసుల కంట పడకుండా రాష్ట్రాలు దాటిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా కొందరు డీసీఎం పైన .. మరికొందరు లారీ టైర్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. డీసీఎం వ్యాన్ లో అడుగు భాగాన గంజాయి.. పైన కూరగాయలతో తరలిస్తున్నారు. కానీ పోలీసులు ఇచ్చే ట్విస్టులతో అడ్డంగా దొరికిపోయి జైలు పాలవుతున్నారు. ఆంధ్ర నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా గంజాయి రవాణా సాగుతోంది. తెలంగాణ మీదుగా సాగుతున్న ఈ అక్రమ గంజాయి రవాణా పై పోలీసులు ఉక్కు పాదంమోపుతున్నారు. నిరంతర నిఘాను కూడా పెంచారు. దీంతో ఆంధ్ర నుంచి గుంటూరు, నాగార్జునసాగర్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను నాగార్జున సాగర్ పోలీసులు పట్టుకున్నారు. నాగార్జునసాగర్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా 330 కేజీల గంజాయి దొరికింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *