హజారీబాగ్: జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో గత వారం అదృశ్యమైన 11వ తరగతి విద్యార్థి బావిలో శవమై కనిపించాడు. ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో చదువుతున్న బాలుడిని వివాదం కారణంగా అతని సహవిద్యార్థులే హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన హజారీబాగ్ జిల్లాలోని ఇచక్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించుకునేందుకు విద్యార్థి జనవరి 6న సహచర విద్యార్థులతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తమ బిడ్డ కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, దీంతో తాము దర్యాప్తు ప్రారంభించామని కొర్ర పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి నిషి కుమారి తెలిపారు.