సమాజంలో విలువలు రోజురోజుకీ దిగజారి పోతున్నాయి. విచక్షణ కోల్పోతున్న మనిషి ఏం చేస్తున్నాడన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నాడు. సోషల్ మీడియా మోజులో పడిపోయి, బంధాలను సైతం తెంచుకుంటున్నాడు. తాజాగా బిహార్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియా పిచ్చి పరాకాష్టకు చేరిందనడానికి ఉదాహరణగా మారింది.
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వద్దు అని వారించినందుకు ఓ భార్య ఏకంగా భర్తను హతమార్చింది. భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడాన్ని భర్త వ్యతిరేకించగా భర్తపై కోపం పెంచుకున్న మహిళ భర్తనే కడతేర్చింది. ఈ దారుణ సంఘటన ఖోడాబంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని ఫఫౌట్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడు సమస్తిపూర్ జిల్లాలోని నర్హన్ గ్రామ నివాసి అయిన మహేశ్వర్ కుమార్ రేగా గుర్తించారు. మహేశ్వర్ కోల్‌కతాలో కూలీ పని చేస్తూ కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో అతని భార్య రాణి కుమారి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే భార్య ఇన్‌స్టాలో రీల్స్ చేయడం మహేశ్వర్‌కు నచ్చలేదు. దీంతో ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే తీవ్ర కోపానికి గురైన భార్య, అత్తమాలతో కలిసి.. భర్తను హతమార్చాడు. ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.