ఖమ్మం: అమెరికాలోని టెక్సాస్‌లో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాలోని పెనుబల్లి మండలానికి చెందిన వీఎం బంజర్‌కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ముక్కెర సాయి రాజీవ్‌రెడ్డికి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఏడాది క్రితం వివాహమైంది. అతని తండ్రి ఎం భూపాల్ రెడ్డి గ్రామంలో నివసిస్తున్నారు.