బంగారం ప్రియులకు శుభవార్త. దీపావళి పండుగకు ముందు బంగారం ధరలు తగ్గాయి. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్న నిలకడగా ఉండగా.. నేడు గణనీయంగా తగ్గాయి. సోమవారం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పండని పసిడి ధర రూ.450 తగ్గి రూ.73,150కి చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490. తగ్గి రూ. 79,800 కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు గత మూడు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.98,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి లక్షా ఏడు వేలుగా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరులో 97 వేలుగా కొనసాగుతోంది.