తాజాగా తగ్గిన బంగారం ధరలు, మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం ప్రియులకు షాక్ ఇస్తూ, వరుసగా మూడు రోజులు పెరిగింది. రూ.160, రూ.820, రూ.870 పెరగడంతో బంగారం ధర మళ్లీ 80 వేలకు చేరింది. హ్యాట్రిక్ లాభాలతో దూసుకెళ్లిన బంగారం ధరలు. నేడు నిలకడగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (డిసెంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,850 కాగా, 24 క్యారెట్ల ధర రూ.79,470గా ఉంది.
మరోవైపు వెండి ధర మాత్రం భారీగా పెరుగుతోంది. మంగళవారం కిలో వెండిపై రూ.4,500 పెరగగా, నిన్న రూ.1,000 తగ్గింది. నేడు మరలా రూ.1,000 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.96,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.1,04,000గా నమోదైంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.96,500గా ఉంది.