సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటికే పలు ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పలు ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ తన ప్రత్యేక శైలితో మార్కెట్‌లో ఆకట్టుకుంటున్నారు. తాజాగా, మహేశ్ బాబు మరో ప్రతిష్టాత్మక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు.
సన్ టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త బ్రాండ్ అయిన ట్రూజన్ సోలార్కు మహేశ్ ప్రచారం చేయబోతున్నారు. ఈ బ్రాండ్ తొలి ప్రకటన చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ప్రకటనకు దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ ప్రకటన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ, “ట్రూజన్ సోలార్‌లో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థతో కలసి పనిచేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తోంది,” అని వ్యాఖ్యానించారు.