దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. పశ్చిమాసియాలోని యుద్ధ వాతావరణ పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. సోమవారం ఉదయం మార్కెట్ ప్రారంభంలో భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు రెడ్ మార్క్ లోనే కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 1,272 పాయింట్లు నష్టపోయి 84,299 దగ్గర ముగియగా, నిఫ్టీ 368 పాయింట్లు నష్టపోయి 25, 810 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.80 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో హీరో మోటోకార్ప్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా నష్టపోగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ లాభపడ్డాయి. మెటల్ మరియు మీడియా (ఒక్కొక్కటి 1 శాతం చొప్పున) మినహా అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్, ఐటీ, టెలికాం, ఫార్మా, రియల్టీ 1-2 శాతం క్షీణించడంతో నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ స్వల్ప నష్టాలతో ముగియగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.