దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగాయి. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు కోల్పోయి 84,266కి పడిపోయింది. నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 25,796 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.22%), ఇన్ఫోసిస్ (1.50%), కొటక్ బ్యాంక్ (1.48%), ఎస్బీఐ (1.19%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.68%), ఏసియన్ పెయింట్స్ (-1.54%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.27%), టాటా మోటార్స్ (-0.96%), టాటా స్టీల్ (-0.86%).