అదానీ గ్రూప్ పై లంచం ఆరోపణలతో అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో, నిన్న ముగిసిన భారత స్టాక్ మార్కెట్ నేడు భారీ లాభాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ 1,700 పాయింట్లు పెరిగి 78,937 వద్ద లాభాల్లో కొనసాగుతుండగా, నిఫ్టీ సైతం 534 పాయింట్లకు పైగా వృద్ధితో 23,889 వద్ద ట్రేడవుతోంది.
అమెరికాలో కేసు కారణంగా నిన్న భారీగా పతనమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేడు కోలుకున్నాయి. ఈ మధ్యాహ్నం సమయానికి స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.