‘దీపావళి’ పండుగకు ముందే బంగారం ప్రియులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇప్పుడు కొండెక్కుతున్నాయి. వరుసగా మూడో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం (అక్టోబర్ 18) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.72,400కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.870 పెరిగి రూ.78,980కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, బంగారం నిల్వ వంటి అంశాలు, బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. దీపావళి, ధన్ తేరస్ ఉన్న నేపథ్యంలో పసిడి పరుగులు తీస్తుందే తప్ప, తగ్గదని చెబుతున్నారు.
మరోవైపు వెండి కూడా పరుగులు పెడుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై నేడు రెండు వేలు పెరిగింది. శుక్రవారం కిలో వెండి రూ.99,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష ఐదు వేలుగా ఉంది.