కేంద్ర బడ్జెట్ సందర్భంగా భారీగా పడిపోయిన బంగారం ధర మళ్లీ రోజురోజుకూ పెరుగుతోంది. బంగారం ధర సోమవారం (12.08.2024) మళ్లీ పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.250 పెరిగింది. ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,450 ఉండగా, సోమవారం ధర రూ.64,700కి చేరింది. ఆదివారం రూ.70,310గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం రూ.70,580కి పెరిగింది. సోమవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.270 పెరిగింది.
కిలో వెండి ధరపై రూ.600 తగ్గింది.సోమవారం రూ.82,500కి చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండికి డిమాండ్ బాగానే ఉంది.