ఇటీవల ప్రపంచ పరిణామాలతో బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తుండగా, తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం నేపథ్యంలో బంగారం ధర ఇంకాస్త తగ్గింది. 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం రూ.76,369గా ఉంది.
అమెరికా ఎన్నికలు ముగిశాక ఈ రెండ్రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.2,100 వరకు పతనమైంది. భారత మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.76,570గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.74,720గా ఉంది. అదే సమయంలో, వెండి ధరలోనూ భారీ తగ్గుదల కనిపించింది. కేజీ వెండిపై రూ.4,050 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.90,601గా ఉంది.