బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. పసిడి ధరలు వరుసగా మూడో రోజు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో గోల్డ్ రేట్స్ ఆల్‌టైమ్ రికార్డు ధరకు చేరుకున్నాయి. బులియన్ మార్కెట్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1200 పెరిగి.. రూ.77,300గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1310 పెరిగి, రూ.84,330గా ఉంది. బడ్జెట్ ప్రవేశానికి ముందు బంగారం ధరలు పెరగడం విశేషం. ఆల్‌టైమ్ రికార్డుకు చేరుకోవడంతో పసిడి ప్రియులు హడలెత్తిపోతున్నారు.
మరోవైపు వెండి రేటు కూడా పరుగులు పెడుతోంది. ఇటీవలి కాలంలో స్థిరంగా ఉన్న వెండి, వరుసగా రెండోరోజు పెరిగింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 పెరిగి, రూ.99,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష ఏడు వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.99,500గా కొనసాగుతోంది.