బంగారం ప్రియులకు భారీ ఊరట లభించింది. నూతన సంవత్సరంలో నెల రోజుల పాటు వరుసగా బంగారం ధర పెరిగి రికార్డు స్థాయికి చేరింది. తులం బంగారం 84 వేల రూపాయల మార్కులు సైతం దాటింది. సోమవారం పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ లభించింది. బంగారం ధర తగ్గి కాస్త కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించింది.
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం 22 క్యారెట్స్ 77,050 ఉండగా 24 క్యారెట్ 10 గ్రాముల (తులం) బంగారం 80,050 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం మార్కెట్ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి. ఇక పోతే వెండి ధరలు కిలోకు రూ.1,07,000గా కొనసాగుతుంది.