భారతీయులకు బంగారం అంటే ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలను అలంకరణగా భావిస్తారు. మరియు బంగారం కూడా మంచి పెట్టుబడి ఎంపిక. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి.అక్కడ రేట్లు పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి. అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతుంది. అక్కడ స్థిరంగా ఉంటే ఇక్కడ స్థిరంగా ఉంటుంది. బంగారం మరియు వెండి ధరలను ప్రభావితం చేసే అనేక అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి. డాలర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ఇప్పుడు కొత్త సంవత్సరం వేళ పసిడి ధరలు వరుసగా పెరుగుతూ షాకిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు రూ.450 తగ్గడంతో తులం రూ. 72,150 వద్ద ఉంది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పుత్తడి ధర రూ. 490 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములకు రూ.78,710 వద్ద కొనసాగుతోంది. ఇక దాదాపు వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న వెండి రేట్లు తాజాగా తగ్గాయి. ఈ క్రమంలో నేడు రూ.1000 తగ్గింది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం కిలోకు రూ. 99000కు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *