గత వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలకు నిన్న బ్రేక్ పడింది. 10 గ్రాముల తులం బంగారంపై 600 రూపాయలు తగ్గింది. హమ్మయ్యా.. పసిడి ధరలు తగ్గాయని సంతోషించకముందే మళ్లీ షాక్ ఇచ్చాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.100, 24 క్యారెట్ల ధర రూ.110 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,950 కాగా, 24 క్యారెట్ల ధర రూ.79,580గా ఉంది.
ఈరోజు బంగారం ధర పెరిగింది, కానీ వెండి ధర తగ్గింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.4000 వేలు తగ్గింది. శుక్రవారం కిలో వెండి రూ.98,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర లక్షా ఏడు వేల వరకు కొనసాగుతోంది.