ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 13న ప్రారంభం కానున్న మహా కుంభమేళాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 రోజుల పాటు ఈ మహా కుంభమేళా జరగనుంది.

ఈ కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం వస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ సమయంలోనే నదుల నీరు అమృతం లాగా స్వచ్ఛంగా మారుతుందని హిందువులు నమ్ముతారు. ఈ కుంభమేళా సమయంలో స్నానం చేయడంతో సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఇక, ఈ కుంభమేళాలో రాయల్ స్నానానికి ప్రత్యేకతలు ఉన్నాయి. గంగా, యమునా, సరస్వతి నదులు ప్రయాగ్‌రాజ్ లో కలుస్తాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. మత విశ్వాసాల ఆధారంగా ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *