తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు రాముడి అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన తెలిసిన మహనీయులు కాబట్టి ఈ ఇరువురిని దర్శించుకున్న వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుందని భక్తుల నమ్మకం.
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు వాహన సేవను తిలకించారు. భక్తి పారవశ్యంతో స్వామిని దర్శించుకొని పులకించారు. ఆలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్థ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారికి గజ వాహనసేవ ఉండనుంది.