హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌తోపాటు జంటనగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు ఖజానా నాణేలను పంపిణీ చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనానికి ఆటంకం లేకుండా చేశారు.
ప్రతియేటా మాదిరిగానే ఈ యేడు కూడా అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే ఈసారి అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. భక్తుల రద్దీలో భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతమైన సౌత్ జోన్ ప్రాంతంలో గట్టి భద్రత , నిఘా ఉంచారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్యలు తెలెత్తకుండా పూర్తి స్థాయి భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు.