తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపా దాస్ మున్షీ, అమెరికన్ కాన్సులెట్ ప్రతినిధి ఈ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని, దీవెనలు పొందారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని ఆహ్వానించారు. దాస్ మున్షీ అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బోనాలకు తెలుగు రాష్ట్రలో ప్రత్యక స్థానం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆమె కోరారు. బోనాల సందర్బంగా అమెరికన్ కాన్సులెట్ ప్రతినిధి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ పూజారులు ఆమెని శాలువాతో సత్కరించి అమ్మవారి చీరని బహుమానంగా ఇచ్చారు.