శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం శ్రీ సత్యసాయి జిల్లా హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం ప్రారంభం కాగా మొత్తం 41 రోజుల పాటు ఆలయ ఆదాయం రూ.65,74,179/- నగదు రూపంలో వచ్చింది.
ఆలయ కమిటీ చైర్మన్ జెరిపిటి గోపాల్ కృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి, హుండీ సూపర్‌వైజర్ నరసింహరాజు, హిందూపురం డివిజన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీ అధికారి, పాలకమండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, కెనరా బ్యాంక్, కదిరి మేనేజర్ మధుసూధన్, కెనరా బ్యాంక్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.