హైదరాబాద్: గాంధీ శిల్పాబజార్ జాతీయ, సంక్రాంతి సంబరాలను సోమవారం శిల్పారామంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించారు.చేనేత మరియు హస్తకళల రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో శిల్పారామం హైదరాబాద్ మరియు కమిషనర్ హస్తకళల అభివృద్ధి సంయుక్తంగా ఈ మేళా నిర్వహిస్తున్నారు. శిల్పారామం మాదాపూర్ ప్రాంగణంలో ఉదయం 10.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళా ఉత్పత్తులతో కళాకారులు సందర్శకులకు అందుబాటులో ఉంటారు.
తొలిరోజు శ్రీమతి శ్రీలత పావని విద్యార్థులు కూచిపూడి నృత్యం, బీరప్ప బృందం ఒగ్గు డోలు ప్రదర్శనలను ప్రదర్శించినట్లు సీనియర్ అధికారి తెలిపారు.