తాడేపల్లిగూడెంలో ధర్మప్రచార పరిషత్‌ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ధర్మప్రచార మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవం మొదటి రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దివ్య కల్యాణ మహోత్సవం దర్శనీయ మహోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ధర్మ ప్రచార మహోత్సవం జనవరి 12న ప్రారంభమై ఫిబ్రవరి 29 వరకు కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *